AP SSC Public Examinations March 2026

ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు మార్చి 2026లో జరుగనున్నాయి. Chief Superintendents & Invigilators తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇక్కడ ఉన్నాయి.

AP SSC Public Examinations March 2026 - Timetable & Instructions

ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు మార్చి 2026లో జరుగనున్నాయి. Chief Superintendents & Invigilators తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇక్కడ ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్ Board of Secondary Education వారు మార్చి-2026 లో నిర్వహించనున్న SSC Public Examinations (Regular and Private Candidates) కోసం పరీక్షా కేంద్రాల్లో పాటించవలసిన నియమావళి మరియు Examinations Conducting Register వివరాలు విడుదలైనవి.

పరీక్షల టైమ్‌టేబుల్ (Exam Timetable)

  • పరీక్షల ప్రారంభ తేదీ: 16 మార్చి 2026 (First Language).
  • పరీక్షల ముగింపు తేదీ: 01 ఏప్రిల్ 2026 (SSC Vocational Course).
  • పరీక్షా సమయం: ఉదయం 09:30 AM నుండి 12:45 PM వరకు (కొన్ని సైన్స్ మరియు ఒకేషనల్ సబ్జెక్టులకు మినహాయింపు ఉంటుంది).

ఇన్విజిలేటర్స్ కు ముఖ్యమైన సూచనలు

  • Bar coding పరీక్ష ప్రారంభానికి ముందు రోజు Chief Superintendent ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్విజిలేటర్లు విధిగా హాజరు కావాలి.
  • పరీక్ష రోజులలో Invigilators ఒక గంట ముందుగానే Examination Hall కు చేరుకోవాలి.
  • OMR Sheet ఖచ్చితంగా ఆ విద్యార్థికే ఇవ్వవలెను. తప్పులు జరగరాదు.
  • విద్యార్థి Roll Number ఎక్కడా వేయరాదు. కేటాయించిన బాక్స్ లో మాత్రమే సంతకం చేయాలి.
  • Main Answer Booklet యొక్క మూడు అంకెల Serial Number ను OMR Sheet లో నమోదు చేయించాలి.
  • Answer Booklets సీరియల్ క్రమంలో పంపిణీ చేయాలి. Absentee స్థానంలో కూడా Main Answer Booklet ఉంచాలి.
  • Blank OMR Sheet వాడినట్లయితే Proforma-VI లో నమోదు చేయాలి.
  • Invigilator ముందుగా Main Answer Booklets పై సంతకం చేయరాదు.
  • OMR Sheet ను Main Answer Booklet పైన పెట్టి సూచించిన చోట్ల పిన్ చేసి Paper Seals అంటించాలి.
  • Bar Coding ప్రాంతంలో రాయకూడదు, చెరపకూడదు.
  • Maps & Graph Sheets పై పేరు లేదా Roll Number రాయకూడదు. మూడు అంకెల Serial Number మాత్రమే వ్రాయాలి.

పరీక్షా గదిలో అవసరమైన Proformas

  • Seating Arrangement – ప్రతి గదికి 1 కాపీ.
  • PROFORMA - II – 24/12 Page Answer Booklets వివరాలు నమోదు చేయాలి.
  • PROFORMA - III – ప్రతి Roll Number కి ఇచ్చిన Answer Booklet Serial No. నమోదు చేయాలి.
  • PROFORMA - VI – Blank Bar Coded OMR Sheets వివరాలు నమోదు చేయాలి. (వాడకపోతే 'Nil' రిపోర్ట్ ఇవ్వాలి).

CS - DO REGISTER AND PRINTOUTS FOR SSC 10TH EXAM DUTY

పదవ తరగతి డ్యూటీ కి సంబంధించి CS , DO లు print తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు, డ్యూటీ అటెండ్ అయ్యే ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు.

SSC PUBLIC EXAMINATIONS CONDUCTING REGISTER (MARCH 2026)

CS DO Booklet Register for SSC EXAM Duty March 2026_compressed.pdf

CSDO (Final)_2026

CSDO (Final)_2026.pdf

Exam Paper Security Instructions

10వ తరగతి & 9వ తరగతి S.A.2 ప్రశ్నాపత్రాలు

10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మరియు 9 వ తరగతి యొక్క ఎస్.ఏ.2 ( S.A.2 ). పరీక్షల ప్రశ్నాపత్రాలను 23-02-2026 సోమవారము నుండి మండల విద్యాశాఖాధికారి కార్యాలయ కేంద్రము (ఎమ్.ఆర్ .సి) ల కు పంపబడుతున్నాయి. 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మరియు 9 వ తరగతి యొక్క ఎస్.ఏ.2 ( S.A.2 ). పరీక్షల ప్రశ్నాపత్రాలను సురక్షితంగా భద్రపరచడానికి ,మండల విద్యాశాఖ అధికారులకు సూచనలు :- 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మరియు 9 వ తరగతి యొక్క ఎస్.ఏ.2 ( S.A.2 ). పరీక్షల ప్రశ్నాపత్రాలను MRC వద్ద సురక్షితంగా భద్రపరచుకోవాలి.

  • మండల విద్యాశాఖ అధికారులు (MEO's) 1 మరియు 2 మరియు పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు భద్రపరచబడిన పత్రాల సంరక్షకులుగా ఉంటారు.
  • మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి సెషన్‌లో పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు మాత్రమే సంబంధిత పాఠశాలలకు ప్రశ్నాపత్రాల బండిల్‌లను అందజేయవలెను.
  • MEOలు ప్రశ్నాపత్రాల సమగ్రతను నిర్ధారించుకోవాలి. వారు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRPలు)తో కలిసి, పరీక్షలు సజావుగా మరియు న్యాయంగా జరుగుతున్నాయని ధృవీకరించడానికి పరీక్షా సమయంలో పాఠశాలలను సందర్శించాలి.
  • ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, పాఠశాల సముదాయం HMలు, MEOలు మరియు CRPSలు వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలి.
  • ప్రైవేట్ మరియు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో పరీక్ష నిర్వహణ విధానాలను పర్యవేక్షించడంపై MEOలు మరియు CRPలు దృష్టి పెట్టాలి.
  • గౌరవ కమిషనర్ ఆదేశాల ప్రకారం, MEO లు ఉన్నత పాఠశాల ల కు , ప్రశ్నాపత్రాలను ప్రతి సెషన్‌లో పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందు మాత్రమే సంబంధిత పాఠశాలలకు ప్రశ్నాపత్రాల బండిల్‌లను అందజేయవలెను. ఇందుకు సంబంధించి ఎవరైనా ఆదేశాలను ఉపేక్షిస్తే, ఆయా HM /MEO లు బాధ్యత వహించాల్సి ఉంటాదని , గౌరవ కమిషనర్ తెలిరచేశారు.